Site icon NTV Telugu

KVS NVS Recruitment 2025: కేంద్రీయ, నవోదయ విద్యాలయాలలో సుమారు 10,000 పోస్టులు!.. కొడితే లైఫ్ సెట్

Jobs

Jobs

నిరుద్యోగులకు ఎగిరిగంతేసే శుభవార్త. వందలు కాదు ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోవడం ఖాయం. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నియామకాల గురించి CBSE ఒక షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా సమాచారం ఇచ్చింది.

Also Read:Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..?

నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి అంటే నవంబర్ 14 నుండి ప్రారంభమవుతుంది. చివరి తేదీ 4 డిసెంబర్ 2025 వరకు కొనసాగుతుంది. నివేదికల ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సుమారు 10,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 7,444 పోస్టులు బోధనా, 1,712 పోస్టులు బోధనేతర పోస్టులకు కేటాయించబడ్డాయి. అయితే, ఇది అధికారిక సంఖ్య కాదని గమనించాలి.

Also Read:Mega158 : చిరంజీవి – కొల్లి బాబీ సినిమాలోకి టాప్ టెక్నీషియన్ జాయిన్..

దరఖాస్తులు ప్రారంభించేటపుడు పోస్టులు, అర్హతలను వివరించే వివరణాత్మక నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియలో TGT, PGT, PRT, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రిన్సిపాల్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in, kvssangathan.nic.in, navodaya.gov.in లను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version