తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈనెల 26నుంచి ఆక్టోబర్ 18వరకు కొత్త దుకాణాల లైసెన్స్ ల జారీకి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కొత్త మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలు చెల్లించి మద్యం టెండర్లలో పాల్గొనాలని ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
Also Read:Jatadhara: సోల్ అఫ్ జటాధర భలే ఉందే !
రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలు ఉన్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపుకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దుకాణాల లైసెన్స్ పొందిన వారు ఫస్ట్ ఇన్ స్టాల్మెంట్ మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించాలి. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించాలి. నవంబర్ 1 నుంచి నూతన దుకాణాల లైసెన్స్ అమలులోకి వస్తుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
