Apple Lauched Watch Series 10 and AirPods 4: ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్‌లో టెక్ దిగ్గజం ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌లో ముందుగా లాంచ్ అయింది ‘యాపిల్ వాచ్ సిరీస్ 10’. ఈ వాచ్ సిరీస్‌లో పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే.. ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. వైడ్ యాంగిల్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. సిరీస్ 9తో పోలిస్తే.. సిరీస్ 10 డిస్‌ప్లే పెద్దగా ఉండడంతో పాటు సన్నగా ఉంటుంది.
Apple Watch Series 10 Price:
సిరీస్ 10 వాచ్‌లు అల్యూమినియమ్, పాలిష్‌డ్ టైటానియమ్ పినిష్‌తో వచ్చాయి. దీంతో ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఎస్ 10 చిప్‌తో పనిచేసే ఈ సిరీస్‌లో ‘స్లీప్ ఆప్నియా’ ఫీచర్ ఉంది. ఇది నిద్రలో శ్వాస సంబంధించిత ఆటంకాలను గుర్తిస్తుంది. సిరీస్ 9తో పోలిస్తే వేగంగా ఛార్జింగ్ అవుతుంది. 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. జీపీఎస్ ధర 399 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. జీపీఎస్ ప్లస్ సెల్యూలార్ ధర 499 డాలర్లు కాగా.. అల్ట్రా 2 ధర 799 డాలర్లుగా ఉంది.
Apple AirPods 4 Price:
యాపిల్ ఎయిర్‌ప్యాడ్ 4లో సిరి ఫీచర్‌ను ఇచ్చారు. టైప్ సీ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. యాపిల్ వాచ్ ఛార్జర్‌లతో పాటు ఇతర వైర్‌లెస్ ఛార్జర్లను సైతం వాడుకోవచ్చు. ఈ ఎయిర్‌ప్యాడ్ 30 గంటల బ్యాటరీని ఇస్తాయని కంపెనీ తెలిపింది. ఎయిర్‌పాడ్స్ 4 ధర 129 డాలర్లుగా ఉంది. యాక్టివ్ నాయిస్ క్యానిసిలేషన్ మోడల్ ధర 179 డాలర్లుగా కంపెనీ పేర్కొంది.
Also Read: iPhone 16 Price: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
Apple AirPods Max Price:
యాపిల్ ఈవెంట్‌లో ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ కూడా లాంచ్ అయింది. ఇది ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ హెడ్‌ఫోన్స్ యూఎస్‌బీ సీ టైప్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐఓఎస్ 18తో పనిచేసే వీటి ధర 599 డాలర్లుగా కంపనీ నిర్ణయించింది. భారత్‌లో ఈ ధర మరింత పెరగనున్న విషయం తెలిసిందే.