Apple School Sale 2024: ‘యాపిల్’ స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్!
- యాపిల్ స్కూల్ సేల్ 2024
- మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్
- సెప్టెంబర్ 20 వరకు సేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple School Sale 2024 Dates and Discounts in India: ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ స్కూల్ సేల్‌ను భారతదేశంలో ప్రారంభించింది. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ సేల్.. 2024 సెప్టెంబర్ 20 వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో భాగంగా ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఐ మ్యాక్‌పై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ను యాపిల్ అందిస్తోంది. యాపిల్ వెబ్‌సైట్‌లో అన్ని డిస్కౌంట్ వివరాలు ఉన్నాయి.
11 ఇంచెస్ ఐప్యాడ్ ఎయిర్ (వైఫై మోడల్)+128జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.54,990కి.. 13 ఇంచెస్ ఐప్యాడ్ ఎయిర్ (వైఫై మోడల్)+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,990కు అందుబాటులో ఉంది. వైఫై+ సెల్యులార్ మోడల్ కావాలంటే మాత్రం ఎక్కువ చెల్లించాల్సిందే. వీటి కొనుగోలుపై రూ.6,900 విలువ చేసే యాపిల్ పెన్సిల్ ఉచితంగా పొందొచ్చు.
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
11 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో (వైఫై మోడల్)+256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,900.. 13 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో (వైఫై మోడల్)+256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900గా ఉంది. వీటి కొనుగోలుపై రూ.10,900 విలువ గల యాపిల్ పెన్సిల్ ప్రోను ఉచితంగా కంపెనీ అందిస్తోంది.
13 ఇంచెస్ మ్యాక్‌బుక్ ఎయిర్(M2), 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.89,990.. 13 ఇంచెస్ మ్యాక్‌బుక్ ఎయిర్(M3), 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.1,04,900.. 15 ఇంచెస్ మ్యాక్‌బుక్ ఎయిర్(M3), 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.1,24,900గా ఉంది. వీటి కొనుగోలుపై లైట్నింగ్ ఛార్జింగ్ కేస్‌తో వచ్చిన ఎయిర్‌పాడ్ ఉచితంగా పొందొచ్చు. ఈ ఎయిర్‌పాడ్ ధర రూ.19,900.
Also Read: India Playing XI: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. దూబే, జడేజాపై వేటు! హైదరాబాద్ ప్లేయర్ ఎంట్రీ
స్కూల్ సేల్‌లో 14 ఇంచెస్ మ్యాక్‌బుక్ ప్రో రూ.1,58,900కు లభిస్తోంది. 16 మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.2,29,900గా ఉంది. ఎం3 చిప్‌సెట్‌తో తీసుకొచ్చిన ఐమ్యాక్ రూ.1,29,900కే లభిస్తోంది. మ్యాక్ మినీ (ఎం2)ని రూ.49,900కే మీరు కొనుగోలు చేయొచ్చు. వీటి కొనుగోళ్లపై 3జెన్ ఎయిర్‌పాడ్స్ ఉచితంగా వస్తుంది.
తాజావార్తలు
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!