Site icon NTV Telugu

Apple School Sale 2024: ‘యాపిల్‌’ స్కూల్‌ సేల్‌.. ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్!

Apple School Sale 2024

Apple School Sale 2024

Apple School Sale 2024 Dates and Discounts in India: ప్రముఖ టెక్‌ కంపెనీ ‘యాపిల్‌’ స్కూల్‌ సేల్‌ను భారతదేశంలో ప్రారంభించింది. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ సేల్‌.. 2024 సెప్టెంబర్‌ 20 వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో భాగంగా ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఐ మ్యాక్‌పై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ను యాపిల్‌ అందిస్తోంది. యాపిల్‌ వెబ్‌సైట్‌లో అన్ని డిస్కౌంట్ వివరాలు ఉన్నాయి.

11 ఇంచెస్ ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌)+128జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.54,990కి.. 13 ఇంచెస్ ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌)+128జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.74,990కు అందుబాటులో ఉంది. వైఫై+ సెల్యులార్‌ మోడల్‌ కావాలంటే మాత్రం ఎక్కువ చెల్లించాల్సిందే. వీటి కొనుగోలుపై రూ.6,900 విలువ చేసే యాపిల్‌ పెన్సిల్‌ ఉచితంగా పొందొచ్చు.

11 ఇంచెస్ ఐప్యాడ్‌ ప్రో (వైఫై మోడల్‌)+256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.89,900.. 13 ఇంచెస్ ఐప్యాడ్‌ ప్రో (వైఫై మోడల్‌)+256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.1,19,900గా ఉంది. వీటి కొనుగోలుపై రూ.10,900 విలువ గల యాపిల్‌ పెన్సిల్‌ ప్రోను ఉచితంగా కంపెనీ అందిస్తోంది.

13 ఇంచెస్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌(M2), 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.89,990.. 13 ఇంచెస్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌(M3), 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.1,04,900.. 15 ఇంచెస్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌(M3), 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.1,24,900గా ఉంది. వీటి కొనుగోలుపై లైట్నింగ్‌ ఛార్జింగ్‌ కేస్‌తో వచ్చిన ఎయిర్‌పాడ్‌ ఉచితంగా పొందొచ్చు. ఈ ఎయిర్‌పాడ్‌ ధర రూ.19,900.

Also Read: India Playing XI: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. దూబే, జడేజాపై వేటు! హైదరాబాద్ ప్లేయర్ ఎంట్రీ

స్కూల్‌ సేల్‌లో 14 ఇంచెస్ మ్యాక్‌బుక్‌ ప్రో రూ.1,58,900కు లభిస్తోంది. 16 మ్యాక్‌బుక్‌ ప్రో ధర రూ.2,29,900గా ఉంది. ఎం3 చిప్‌సెట్‌తో తీసుకొచ్చిన ఐమ్యాక్‌ రూ.1,29,900కే లభిస్తోంది. మ్యాక్‌ మినీ (ఎం2)ని రూ.49,900కే మీరు కొనుగోలు చేయొచ్చు. వీటి కొనుగోళ్లపై 3జెన్‌ ఎయిర్‌పాడ్స్‌ ఉచితంగా వస్తుంది.

Exit mobile version