Site icon NTV Telugu

Apple Event 2025: నేడే ‘ఐఫోన్’ 17 లాంచ్ ఈవెంట్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Iphone 17 Launch Time

Iphone 17 Launch Time

‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అ డ్రాపింగ్’ పేరుతో యాపిల్‌ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు రాత్రి జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను మనం చూడవచ్చు. యాపిల్ ఈవెంట్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఏంటో ఓసారిచూద్దాం.

ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్ యూఎస్‌లోని కుపెర్టినోలో జరుగుతుంది. భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. ఈవెంట్ ముగిసిన అనంతరం రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈవెంట్‌లో యాపిల్‌ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ కోసం యాపిల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్, ధరలను మనం త్వరలోనే తెలుసుకోవచ్చు.

Also Read: Suryakumar Yadav: ఆసియా కప్‌లో మీరే హాట్ ఫేవరెట్‌.. సూర్యకుమార్‌ ఏమన్నాడంటే?

ఐఫోన్ 17 సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉంటాయి. ప్లస్ మోడల్‌ను ఐఫోన్ 17 ఎయిర్ భర్తీ చేయనుంది. యాపిల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఎయిర్ భారీ మార్పు తేనుంది. 17 సిరీస్‌తో పాటు ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ సిరీస్ 11, వాచ్ SE 3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3లను కూడా లాంచ్ చేయవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ అత్యంత సన్నని మోడల్ అని సమాచారం. ఈ ఫోన్ మందం కేవలం 5.5mm మాత్రమే అని తెలుస్తోంది. ఇందులో 6.6-అంగుళాల స్క్రీన్, ఒకే ఒక కెమెరా ఉండనుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ పెద్ద బ్యాటరీతో కాస్త మందంగా ఉండనుంది.

Exit mobile version