iPhone 16 Discounts on Apple Diwali Sale 2024: ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ సైతం భారత్‌లో దీపావళి సేల్‌ను ప్రారంభించింది. యాపిల్ దీపావళి సేల్ 2024 నేడు (అక్టోబర్ 3) ప్రారంభమైంది. ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఈ సేల్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్లతో పాటు, మ్యాక్‌బుక్, ఐప్యాడ్.. పలురకాల యాపిల్ ఉత్పత్తులపై భారీ ఎత్తున రాయితీలు అందిస్తోంది.
యాపిల్ దీపావళి సేల్ 2024లో ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్‌పై రూ.5 వేల డిస్కౌంట్ అందిస్తోంది. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం3, మ్యాక్‌బుక్ ప్రో పై రూ.10వేల వరకు రాయితీ లభిస్తుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2పై రూ.8వేలు వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక ఐఫోన్ 15 కొనుగోలు చేసేవారికి బీట్స్ సోలో బడ్స్ ఉచితంగా అందిస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 4 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐప్యాడ్, యాపిల్ వాచ్‌లపై రూ.6వేలు వరకు క్యాష్‌బ్యాక్.. ఎయిర్‌పాడ్‌లపై రూ.4వేలు వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: Gold Rate Today: పండగ వేల షాక్‌లు ఇస్తున్న గోల్డ్.. నేడు తులం ఎంతుందంటే?
ఈ సేల్‌లో కార్డులపై రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులపై మాత్రమే డిస్కౌంట్లు ఉన్నాయి. ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు కార్డ్ హోల్టర్లకు 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌తో మీరు పాత మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. దాంతో మీరు మరింత ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు.