AR Rahman: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మిక అనారోగ్య సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించి, అన్ని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సమాచారం ప్రకారం రెహమాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత తాజాగా ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇందుకు సంబంధించి అపోలో ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల విడుదల చేసింది.
ఈ హెల్త్ బులెటిన్ లో డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. రెహమాన్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరంగా పూర్తి స్థాయిలో కోలుకున్నారని తెలిపారు. రెహమాన్ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేశారు.