ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. ఏపీఎల్ సీజన్ 4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేరు నమోదు చేసుకుకోగా.. ఏడు జట్ల యాజమాన్యం ప్లేయర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది.
Also Read: YS Jagan: సరోజాదేవి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు!
ఏపీఎల్ 2025 వేలంలో ఇప్పటివరకు పైలా అవినాష్‌కు భారీ ధర దక్కింది. రూ.11.5 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు అతడిని సొంతం చేసుకుంది. పీవీ సత్యానారాయణ రాజును రూ.9.8 లక్షలకు భీమవరం బుల్స్ జట్టు కైవసం చేసుకుంది. ఆల్‌రౌండర్‌ల కోసం ప్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. దాంతో ఆల్‌రౌండర్‌లకు జాక్ పాట్ తగులుతోంది. పి.గిరినాథ్ రెడ్డిని రూ.10.05 లక్షలకు రాయలసీమ రాయల్స్.. త్రిపురాన విజయ్‌ను రూ.7.55 లక్షలకు సింహాద్రి వైజాగ్ లయన్స్.. సౌరభ్ కుమార్‌ను రూ.8.80 లక్షలకు తుంగభద్ర వారియర్స్ జట్టు.. యర్రా పృథ్వీ రాజ్‌ను రూ.8.05 లక్షలకు విజయవాడ సన్ షైనర్స్ టీమ్ దక్కించుకున్నాయి. వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
