పబ్లిక్ అకౌంట్లలో ఉండాల్సిన 10వేల కోట్లు దారి మళ్ళించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. జిపిఎఫ్ ఖాతాల నుండీ ఖాతాదారుల అనుమతి లేకుండా 480 కోట్లు విత్ డ్రా చేసిన ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు పాల్పడింది.రాష్ట్రంలో అమలవుతున్న సీపీఎస్ కు చట్టబద్ధత లేదు. ఇప్పటి వరకూ 11వ వేతన సవరణ అంశాలు ఒక కొలిక్కి రాలేదు. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది.. టీచర్ల పరిస్ధితి సరేసరి అన్నారు సూర్యనారాయణ.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 9 నెలల అరియర్స్, పదోన్నతులపై నిర్దిష్ట విధానం తెలుపలేదు.బదిలీలపై నిషేధం ఎత్తివేసి, మహిళా ఉద్యోగినులకు వారి కుటుంబాలకు దగ్గరగా బదిలీ చేసే అంశం పరిష్కరించలేదు.వాణిజ్య పన్నుల విభాగంలో రీజనల్ విధానం కచ్చితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనే…మే 22 నుండి రోజుకొక తాలూకా కేంద్రంలో నిరాహారదీక్ష చేస్తామన్నారు.
జూన్ 8న కలెక్టర్లు, ఆర్డీఓ లకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. జూన్ 14న తాలూకా, జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలు అందిస్తారు. జూన్ 21 జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు అందిస్తామన్నారు. జూన్ 28, 29, 30 లలో జిల్లా కేంద్రాలలో రిలే నిరాహారదీక్షలు చేస్తామన్నారు. జూలై 5 నుంచి జిల్లాలలో బహిరంగ నిరసన ప్రదర్శనలకు షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబరు 31న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు సూర్యనారాయణ తెలిపారు.
Read Also: Rana Daggubati: ‘పరేషాన్’ చేయబోతున్న తిరువీర్!