Site icon NTV Telugu

AP Women Selfie video: చిత్రహింసలు పెడుతున్నారు.. భారత్కు రప్పించండి

Selfi Video

Selfi Video

తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనో.. లేదంటే ఇంట్లో డబ్బుల సమస్య వల్లో పరాయి దేశానికి వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని తన వారిని వదిలి వెళ్లింది ఓ మహిళ. అక్కడ మన భాష కాదు.. మన యాస కాదు. అలాంటి.. దేశమైన కువైట్ కు వెళ్లిన ఏపీకి చెందిన ఓ మహిళ తీవ్ర ఆవేదన చెందుతుంది. పొట్టకూటి కోసం అక్కడికి వెళితే కడుపు నిండా తిండి లేదు, కంటినిండా కునుకు లేదు. చేసిన పనికి జీతం ఇవ్వకపోయిన పర్వాలేదు.. ఇంటికి వెళ్తానని ఆ మహిళ మొర పెట్టుకుంది. కనికరించని యజమాని ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడని తన బాధను చెప్పుకొచ్చింది. రోజూ తనకు నరకం చూపిస్తున్నారంటూ.. చివరి ప్రయత్నంగా తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా తెలియపరిచింది.

Rahul Gandhi: “20-30 ఏళ్లుగా ఓర్చుకున్నా”.. పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన నాగమణి అనే మహిళ కువైట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తనను యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని.. వెంటనే ఇండియాకి తీసుకురావాలని సెల్ఫీ వీడియో ద్వారా ఆ మహిళ తెలియజేసింది. తన ఆరోగ్యం క్షీణించిందని.. నోటి నుండి రక్తం పడుతున్న పట్టించుకోవడంలేదని తీవ్రంగా ఏడుస్తుంది. అయితే.. తనను మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని కాపాడాలని నాగమణి కోరుతుంది.

Pune: 11 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన 67ఏళ్ల వృద్ధుడు!

Exit mobile version