AP Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటుకుని తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు’ఫెంగల్’గా నామకరణం చేశారు. చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో.. దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే… నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. మరో 48 గంటలు దాటిన తర్వాత బాపట్ల, సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది.
Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు అన్నా.. సినిమాలకు రిటైర్‌మెంట్ ఇస్తా: డైరెక్టర్ విక్రమ్
తుఫాన్‌గా మారిన తర్వాత మూడు రోజులకు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటినా మరో మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాలకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఒకవైపు.. ఇప్పటికే పెరిగిన చలిగాలుల ప్రభావానికి తోడు వర్షాలతో జనం బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. మరో వారం రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం తెలుస్తోంది.
Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా!