Site icon NTV Telugu

Nadendla Manohar: కొత్త రేషన్‌కార్డుల పంపిణీపై కీలక అప్డెట్.. డెబిట్ కార్డ్ సైజ్‌లో స్మార్ట్ రైస్ కార్డులు..

Nadendla Manohar

Nadendla Manohar

రాష్ట్ర ప్రగతిలో అందర్నీ భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం 60 శాతం రైస్ కార్డులకు సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు కోసం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని.. కొత్త 9 లక్షల మందికి పైగా కొత్త కార్డులు వచ్చాయన్నారు. కోటి 45 లక్షల 97 వేల..కు పైగా కార్డులు ప్రస్తుతం కొత్త కార్డులతో కలిపి ఉన్నాయని స్పష్టం చేశారు. 4 కోట్లకు పైగా సభ్యులకు కార్డుల సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఎక్కడా నాయకుల ఫొటోస్ లేకుండా కార్డులను డిజైన్ చేశామని తెలిపారు. కుటుంబ సభ్యుల యజమాని ఫోటో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. డెబిట్ కార్డ్ సైజ్ లో స్మార్ట్ రైస్ కార్డు ఇస్తున్నామని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ సహాయం తో అనుసంధానం అయ్యి ఉంటుందన్నారు. ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఆగస్ట్ 25 నుంచి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. 65 ఏళ్ళు దాటిన వృద్ధులకు రేషన్ హోమ్ డెలివరీ జరుగుతోంది…

READ MORE: Priyanka Gandhi: ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రియాంక గాంధీ ప్రసంగం.. అభినందించడంలో పోటీపడ్డ సభ్యులు!

కొన్ని జిల్లాల్లో సమస్యలు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఆయా జిల్లాలకు వెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. దీపం పథకం కోసం హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 93 లక్షల 46 వేల మందికి దీపం పథకం చేరిందని తెలిపారు. దీపం 2 పథకం ఈ నెల 31 వరకు అవకాశం ఉందని.. ఎన్టీఆర్ కృష్ణ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా డిజిటల్ వేలెట్ ఉండేలా దీపం పథకంపై దృష్టి పెట్టామని చెప్పారు.

READ MORE: Mallikarjun Kharge: ట్రంప్ వాదనలను మోడీ ఎందుకు ఖండించడం లేదు..? ఖర్గే ప్రశ్న..

Exit mobile version