NTV Telugu Site icon

AP TET Results 2024: నేడే ఏపీ టెట్‌ ఫలితాలు!

Ap Tet Results 2024

Ap Tet Results 2024

AP TET Results 2024 Today: ఏపీ టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) 2024 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే టెట్‌ ఫలితాలు ఎన్ని గంటలకు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మధ్యాహ్నం తర్వాత టెట్‌ ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

2024 ఫిబ్రవరిలో టెట్‌ ప్రకటన వెలువడటంతో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్‌ నిర్వహించారు. 2.35లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. టెట్‌ ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా వెల్లడించలేదు. నేడు ఫలితాలు విడుదల కానున్నాయి.

టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థులకు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక మెగా డీఎస్సీతో పాటు టెట్‌ నిర్వహించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.