AP TET 2024: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) షెడ్యూల్లో మార్పులు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 మధ్య కాలంలో టెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకోగా.. టెట్ పరీక్షల సన్నద్ధతకు సమయం కావాలని తాజాగా మంత్రి నారా లోకేష్‌ను కోరారు టెట్ అభ్యర్థులు… ఇక, అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్ షెడ్యూల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.. టెట్ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ నిర్వహణ మధ్య 90 రోజుల వ్యవధి ఉందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మార్పులు చేస్తూ.. టెట్ నిర్వహణకు కొత్త షెడ్యూల్ విడుదల చేశారు..
Read Also: Maharastra CM: నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్యాయాన్ని సహించేది లేదు..
ఇక, ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన టెట్ షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 3వ తేదీ వరకు టెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్ వన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ 2 నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇక, అక్టోబర్ 4న కీ విడుదల చేయనున్నారు.. 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.. ఇక, నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు కొత్త షెడ్యూల్‌లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..