NTV Telugu Site icon

AP SSC Results 2025: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Ap Ssc Results 2025

Ap Ssc Results 2025

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఫలితాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1,680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడవద్దని, జీవితం రెండవ అవకాశాన్ని అందిస్తుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని, పాస్ అవ్వడానికి ఇది మరో అవకాశం అని మంత్రి చెప్పుకొచ్చారు.

విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అలానే మన మిత్ర వాట్సప్‌ యాప్, లీప్‌ మొబైల్‌ యాప్‌లలో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మన మిత్ర వాట్సప్‌ నంబరు 9552300009కు హాయ్‌ అని మెసేజ్‌ చేసి.. విద్యా సేవలను సెలెక్ట్‌ చేసి, ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అనంతరం రోల్‌ నంబరు ఎంటర్ చేస్తే.. ఫలితాలు పీడీఎఫ్‌ రూపంలో వస్తాయి. అదేవిధంగా ‘ఎన్టీవీ‘లో కూడా సులువుగా పదో తరగతి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్‌ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: