AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ 2023 ఫలితాలను విడుదల చేశారు.. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 6,64,152 మంది ఉండగా.. పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 6,09, 081గా ఉంది.. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం.. 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని.. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు మంత్రి బొత్స.. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది.. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.. మరోసారి బాలికలే పైచేయి సాధించారు.. బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతంగా ఉండగా.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. దీంతో.. పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు బాలికలు.
రాష్ట్రంలోని 933 స్కూళ్ళల్లో వంద శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.. అయితే, 38 స్కూళ్ళల్లో సున్నా శాతం ఫలితాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.. ఈ ఏడాది ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ఉండగా.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా 60.39 శాతంతో ఉంది.. ఇక, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఎగ్జామ్స్‌కి.. 6.64 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు.. కేవలం 18 రోజులలోనే టెన్త్ ఫలితాలు విడుదల చేశారు.. రికార్డు స్ధాయిలో ఫలితాలు విడుదల చేశారు.. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల ప్రకటన వరకు పకడ్బందీగా చర్యలు తీసుకుంది విద్యా శాఖ.. సీబీఎస్ఈ తరహాలో ఆరు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహించింది ఎస్ఎస్‌సీ బోర్డు.. లీకేజీ ఆరోపణలు రాకుండా టెన్త్ పరీక్షా కేంద్రాలని నో మొబైల్ జోన్ గా ప్రకటించి పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే..
ఇక, టెన్త్ ఫలాలు వెంటనే తెలుసుకోవడానికి ఈ రెండు వెబ్‌సైట్లను సందర్శించింది.. https://bse.ap.gov.in/ క్లిక్ చేసి.. ఎస్‌ఎస్‌ఎస్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయి.. హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.. ఇక, http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లోనూ ఈ అవకాశం ఉంది.. ఫలితాలను చూసుకోవడంతో పాటు.. ప్రింట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.