Site icon NTV Telugu

AP Ration: తల్లి, కొడుకుని కలిపిన రేషన్ బియ్యం.. 7 ఏళ్ల ముందు ఏం జరిగిందంటే?

Ap Ration

Ap Ration

Ration Rice Connects Family in Adoni: ‘రేషన్ బియ్యం’ కారణంగా ఓ తల్లి, కొడుకు కలిశారు. 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని బాలుడి కోసం.. తల్లిండ్రులు, పోలీసులు, ప్రకటనల ద్వారా ఎంత వెతికినా దొరకలేదు. బాలుడిపై ఆశలు చంపేసుకుని ఆ తల్లి జీవనం కొనసాగిస్తోంది. కాలం కలిసొచ్చిందో, దేవుడు కరుణించాడో తెలియదు కానీ.. రేషన్ బియ్యం ద్వారా చివరకు తల్లి చెంతకు చేరుకున్నాడు. ఈ ఆశ్చర్యకర, ఊహించని ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటుచేసుకుంది.

ఆదోనికి చెందిన వడ్డే శివశంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్. మతిస్థిమితం సరిగా లేని శ్రీకాంత్.. తన 11వ ఏట 2018లో స్వగ్రామమంలో తప్పిపోయాడు. శ్రీకాంత్‌ ట్రైన్‌లో విజయవాడకు వెళ్లాడు. అక్కడ విజయవాడ రైల్వే పోలీసులకంటపడ్డాడు. మొదట చైల్డ్ కేర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాంత్‌ వివరాలు ఏమి చెప్పకపోవడంతో.. విజయవాడ కలెక్టర్ ఉయ్యూరులోని ఓ రిహాబిలిటేషన్ సంస్థలో చేర్పించారు. బాలుడు టీబీతో బాధపడుతుండడంతో రిహాబిలిటేషన్ సంస్థ సిబ్బంది గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం శ్రీకాంత్‌ తన జీవితాన్ని పునఃప్రారంభించాడు.

Also Read: Pawan Kalyan: అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం.. డిప్యూటీ సీఎం పవన్ పోస్ట్ వైరల్!

టూ టౌన్ పీఎస్‌లో శ్రీకాంత్‌పై మిస్సింగ్ కేసు నమోదు అయింది. బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో 2023లో పోలీసులు కేసును క్లోజ్ చేశారు. తాజాగా రేషన్ బియ్యం కోసం రేషన్ షాపు వద్దకు లక్ష్మి వెళ్లగా.. మీ రేషన్ ఉయ్యూరులో తంబ్ వేసి తీసుకెళ్లారని డీలర్ చెప్పాడు. డీలర్‌పై లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు డీలర్‌ను విచారించగా.. రేషన్ బియ్యాన్ని ఉయ్యాలూరులో తంబ్ వేసి తీసుకెళ్లినట్లు చెప్పాడు. రెవిన్యూ అధికారుల సహకారంతో పోలీసులు విషయం తెలుసుకున్నారు. టూ టౌన్ పోలీసులు తప్పిపోయిన కొడుకుని తల్లి వద్దకు చేర్చారు. 11వ ఏట తప్పిపోయిన శ్రీకాంత్.. 18వ ఏట రేషన్ బియ్యం తీసుకుని తల్లి వద్దకు చేరుకున్నాడు. రేషన్‌పై ఫిర్యాదు చేయడానికి వస్తే.. కొడుకుని చెంతకు చేర్చారని లక్ష్మి అధికారులకు కృతజ్ఞతలు చెప్పింది.

Exit mobile version