Site icon NTV Telugu

AP Govt: 3-4 పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫ్రీ!

Ap Population Policy 2025

Ap Population Policy 2025

Andhra Pradesh Population Management Policy 2025: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనాభాను పెంచే చర్యలు మొదలయ్యాయి. ప్రస్తుత రోజుల్లో సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం రెడీ చేస్తోంది. నిపుణులు, మేధావుల సూచనలతో ముసాయిదాను రూపొందిస్తున్నారు. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ఏంటో ఓసారి చూద్దాం.

ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబంకు ఆస్తి పన్ను మినహాయింపు ఉంటుందని ముసాయిదాలో చేర్చారు. ప్రసూతి సెలవులు ఆరు నెలలు నుంచి 12 నెలలకు పొడిగించారు. మూడో బిడ్డ ఉంటే అదనంగా 50 వేలు ప్రోత్సాహకం అందిస్తారు. నాలుగో బిడ్డకూ ఇది కొనసాగుతుంది. పిల్లలు పుట్టేందుకు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ట్రీట్మెంట్ కోసం ఆర్ధిక సహాయం అందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. తల్లులకు వర్క్‌ ఫ్రం హోం కల్పించాలని ముసాయిదాలో చేర్చారు. వీటితో పాటు పలు ప్రతిపాదనలతో ముసాయిదా సిద్ధమవుతుతుంది.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ముసాయిదా ప్రతిపాదనలు:
# ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు
# ప్రసూతి సెలవులు ఆరు నెలలు నుంచి 12 నెలలు పొడిగింపు
# మూడో బిడ్డ ఉంటే అదనంగా 50 వేలు ప్రోత్సాహకం
# పిల్లలు పుట్టేందుకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ఆర్ధిక సహాయం
# తల్లులకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం
# తల్లులకు పిల్లల కోసం క్రెచ్‌లు

Exit mobile version