Site icon NTV Telugu

AP Polycet Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్‌ చేసుకోండి..

Ap Polycet

Ap Polycet

AP Polycet Results: ఏపీలో పాలిసెట్‌-2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం 10.45 నిమిషాలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. https://polycetap.nic.in వెబ్ సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 1,43,592 మంది పరీక్షకు హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు.

AP Polycet Results Live: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. ప్రత్యక్షప్రసారం

పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక పాలిసెట్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు. పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా – గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.

ఇలా చెక్ చేసుకోవచ్చు..

అభ్యర్థులు మొదటగా https://polycetap.nic.in సైట్ లోకి వెళ్లాలి.

పాలిసెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బట్ నొక్కిన తర్వాత మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం.

 

రిజల్ట్ లింక్ ఇదే: https://polycetap.nic.in

 

Exit mobile version