ఎవ్వరూ లేనప్పుడు పోలీసుల అండతో దాడులు చేయించడం కాదు.. దమ్ముంటే చంద్రబాబు దీక్ష ముగిసేలోపు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలనా అస్తవ్యస్థంగా మారిందన్న ఆయన.. 13 జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ను, మాదక ద్రవ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారని.. ఇదే విషయాన్ని టీడీపీ బయటపెట్టిందన్నారు. ఇక, జె-బ్రాండ్లు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు బోండా ఉమ.. దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ కేంద్రంగా మార్చారన్నారు. ప్రమోషన్ల కోసం కక్కుర్తి పడి అధికారులు తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
పోలీసుల అండతో దాడులు కాదు.. దమ్ముంటే..!-బొండా ఉమ
