NTV Telugu Site icon

AP Politics 2024: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్.. అనపర్తి ‌నియోజకవర్గంలలో వేడెక్కిన రాజకీయ వాతావరణం!

Untitled Design

Untitled Design

Sathi Suryanarayana Reddy vs Nallimilli Rama Krishna Reddy: ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ‌నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్‌తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. దాంతో ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. దాంతో అనపర్తిలో ఏమి జరుగుతుందంటూ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read: Sreeleela: సినిమాలకు బ్రేక్ తీసుకోనున్న శ్రీలీలా..ఎందుకంటే?
బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు. నల్లమిల్లి ఇంటి చుట్టూ 50 మంది పోలీసులు మొహరించారు. అనపర్తి మండలం రామవరంలో ‘ఛలో అనపర్తి’కి వెళ్లడానికి రామకృష్ణారెడ్డి సిద్ధమవుతున్నారు.

Show comments