Holidays: శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్.. ఇక నుంచి వారి పుట్టిన రోజు, పెళ్లిరోజులకు కూడా సెలవులే..
- ఏపీ పోలీసులకు శుభవార్త..
- ప్రతీ ఏడాది పుట్టిన రోజు, పెళ్లి రోజులకు సెలవులు మంజూరు..
- ఉత్తర్వులు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం , ఉన్నతాధికారులు తీపి కబురు అందించారు. పోలీసుల సంక్షేమం కోసం ఒక గొప్ప ముందడుగు వేస్తూ.. వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చేలా డీజీపీ (DGP) కార్యాలయం నుంచి తాజాగా ఒక అధికారిక ఉత్తర్వు వెలువడింది.
కుటుంబానికి ప్రాధాన్యత..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పోలీసు ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. పండుగలు, పబ్బాలు అని తేడా లేకుండా వారు ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. దీనివల్ల వారు తమ సొంత కుటుంబ సభ్యులతో సమయం గడపలేక పోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన డీజీపీ.. పోలీసుల మనోధైర్యాన్ని పెంచేందుకు “వేడుక సెలవు” విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రతి పోలీస్ సిబ్బంది తమ పుట్టినరోజు , వివాహ వార్షికోత్సవం (పెళ్లి రోజు) రోజున సెలవు తీసుకోవచ్చు.
అందరికీ సమాన అవకాశం..
ఈ ఉత్తర్వుల ప్రకారం.. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. తమ జీవితంలో ఎంతో కీలకమైన ఈ రెండు రోజులను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వల్ల.. వారిలో ఒత్తిడి తగ్గి, పని పట్ల మరింత ఉత్సాహం కలుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
Also Read:Holidays: శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్.. ఇక నుంచి వారి పుట్టిన రోజు, పెళ్లిరోజులకు కూడా సెలవులే..
అధికారులకు ఆదేశాలు..
ఏవైనా అత్యవసర పరిస్థితులు (ఉదాహరణకు శాంతిభద్రతల సమస్యలు లేదా పెద్ద ప్రమాదాలు) ఉంటే తప్ప, మిగిలిన సమయాల్లో సిబ్బంది ఈ సెలవు అడిగినప్పుడు యూనిట్ అధికారులు ఖచ్చితంగా మంజూరు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల పట్ల ఏపీ పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం డ్యూటీలో ఉండే తమకు, ఏటా ఈ రెండు రోజులు కుటుంబంతో గడిపే అవకాశం దక్కడం పెద్ద ఊరటనిస్తుందని వారు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!