ఏపీ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ చుక్కలు చూపిస్తున్నాడు. బత్తుల ప్రభాకర్ పరారీ వ్యవహారం పోలీసులకు పెను సవాలుగా మారింది. ఈ నెల 22న రిమాండ్ పొడిగింపు కోసం ప్రభాకర్‌ను పోలీసులు బెజవాడలో కోర్టుకు తీసుకువచ్చారు. తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తుండగా.. దేవరపల్లి దగ్గర ప్రభాకర్ పరారయ్యాడు. ప్రభాకర్‌ను పట్టుకోవటం కోసం బెజవాడ, పశ్చిమ గోదావరి నుంచి 5 బృందాలు ఏర్పాటు చేశారు.
Also Read: Suryakumar Yadav: ఐపీఎల్‌లో పరుగుల వరద.. ఆసియా కప్‌లో మాత్రం గుడ్డు! గణాంకాలు చూస్తే షాకే
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం దేవరపల్లి పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రభాకర్ స్వస్థలం చిత్తూరుకు ఒక పోలీస్ బృందం వెళ్లింది. విశాఖ, హైదరాబాద్, గోవా, ఒరిస్సాకు కూడా బృందాలు వెళ్లాయి. ప్రభాకర్ ఆచూకీ ఇంకా దొరకలేదు. వేషం మార్చి తిరుగుతున్నాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. విశాఖ జైలు నుంచి 2021లో పరారై వరస దొంగతనాలు చేసిన ప్రభాకర్.. 2024 డిసెంబర్లో ప్రిజన్ పబ్ లో కాల్పులు చేసి పట్టుబడ్డాడు. ఏపీ, తెలంగాణలో అనేక భారీ నగదు, దొంగతనాలు చేసి కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాకర్‌పై అనేక దొంగతనం కేసులు ఉన్నాయి.
