NTV Telugu Site icon

AP DGP: ఏలో పోలీసు శాఖ అలర్ట్.. జిల్లాలకు ప్రత్యేక అధికారుల కేటాయింపు

New Project (33)

New Project (33)

ఈ నెల 13న పోలింగ్ రోజు ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపుపై ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి జిల్లాకూ ప్రత్యేక పోలీస్ అధికారుల నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జరీ చేశారు. ఏపీ డీజీపీ హరీష్ ఉత్తర్వుల ప్రకారం.. 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు. ఇందులో పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని.. ఎవరైన అల్లర్లు సృష్టించాలని చూస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. ఇవాళే ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీస్ అధికారులకు సూచించారు. సున్నితమైన సెగ్మెంట్లల్లో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను సదురు ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఆదేశించారు.

READ MORE: Auto House: ఆటోను ఇంటి పైకి ఎక్కించేసిన డ్రైవర్.. అలాఎందుకు చేసాడంటే..

ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఆ కేంద్రంలో నిబంధనల మేరకు టేబుల్స్‌ ఏర్పాటు, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు టేబుల్స్‌ ఏర్పాటుపై రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పలు సూచనలు చేశారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగాలని తెలిపారు. ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీ చిత్రీకరించాలని ఆయన సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు ఒకే విడతలో.. నాలుగో దశలో పోలింగ్ జరిగింది. కాగా ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.

Show comments