Site icon NTV Telugu

Gun Missfire: అనంతపురం కలెక్టరేట్‌లో వెపన్ మిస్ ఫైర్!

Gun Misfire

Gun Misfire

అనంతపురం కలెక్టరేట్‌లో వెపన్ మిస్ ఫైర్ ఘటన కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కలెక్టరేట్‌లో గార్డు డ్యూటీలో ఉన్న (1996 బ్యాచ్ AR HC 2242) సుబ్బరాజు 303 వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఛాతీలో నుంచి బుల్లెట్ బయటకు వెళ్లిపోయింది. త్రీవంగా గాయపడిన సుబ్బరాజును అక్కడే ఉన్న గార్డు సిబ్బంది చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు.

Also Read: Ind vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. టీమిండియా స్టార్ ప్లేయర్కు రెస్ట్..!

సుబ్బరాజుకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు. అతడికి ఎలాంటి ప్రాణపాయం లేదని వ్తెద్యులు తెలిపారు. వెపన్ మిస్ ఫైర్ ఘటనప్తె అనంతపురం పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వెపన్ క్లీన్ చేస్తున్న సమయంలో ఘటన జరిగిందా? లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version