ఏపీ వ్యాప్తంగా ఉన్న 92 పట్టణ స్థానిక సంస్థలలో ఉదయం 9 గంటల సమయానికి సగటున 8.39 శాతం ఓటింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లాలోని నగరి పట్టణ స్థానిక సంస్థలో అత్యధికంగా 20.69% ఓట్లు పోల్ అయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు (20.56%) ద్వితీయ స్థానంలో ఉంది. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణ స్థానిక సంస్థలో అత్యల్పంగా 2.95% ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96,89,191 ఓటర్లకు గాను మొదటి రెండు గంటలలో (ఉదయం 9:00 వరకు) 8,12,821 ఓట్లు పోల్ అయ్యాయి.
ప్రధాన నగరాల ఓటింగ్ సరళి:
జీవీఎంసీ (విశాఖపట్నం): 3.34%
విజయవాడ: 7.79%
గుంటూరు: 5.21%
నెల్లూరు: 5.89%
కర్నూలు: 11.15%
తిరుపతి: 11.72%

