NTV Telugu Site icon

Vidadala Rajini: తప్పిన ప్రమాదం.. లిఫ్టులో చిక్కుకున్న మంత్రి రజనీ, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: ఏపీ మంత్రి విడదల రజనీకి ప్రమాదం తప్పింది. తాజాగా ఏపీ మంత్రి విడదల రజనీ లిఫ్టులో చిక్కుకున్నారు. ఏపీ మంత్రి విడదల రజినీతో పాటు లిఫ్టులో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులు కూడా లిఫ్టులో చిక్కుకున్నారు. ఓవర్ లోడ్ అవ్వడంతో కొద్దీ నిమిషాల పాటు లిఫ్ట్ నిలిచిపోయింది.

Read Also: Iyer Clash In Kanchipuram: తమిళనాడులో కొట్టుకున్న అర్చకులు.. ఎందుకో తెలుసా..?

అయితే ఎమర్జెన్సీ కీ ద్వారా లిఫ్ట్‌ను సిబ్బంది ఓపెన్‌ చేశారు. లిఫ్టులో చిక్కుకున్న మంత్రి కాసేపు ఇబ్బంది పడ్డారు. ఇవాళ మంత్రి రజనీ విశాఖ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో జర్నలిస్టుల కోసం వైద్య పరీక్షల కేంద్రం ప్రారంభించారు. ఈ తరుణంలోనే మంత్రి విడదల రజనీ లిఫ్టులో చిక్కుకున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.