National Sports Day: క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని “టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” ర్యాలీని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన వేడుకల్లో మాట్లాడుతూ.. దేశంలో యువతకు కొదవ లేదు ఎన్నో విజయాలు సాధించగలరు అన్నారు.. క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు.. క్రీడల విషయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు.. స్టేడియాల అభివృద్ధికి, కొత్త స్టేడియాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
Read Also: Bill Payments: ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల ప్రకంపనలు.. మంత్రి ఆమోదం లేకుండానే..!
ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టుగా అభివర్ణించారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న ఆమె.. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ప్రతి ఒక్కరూ ఓటమికి కుంగిపోకుండా ఓటమిని మెట్టుగా చేసుకొని విజయ శిఖరాలు అవరోధించాలన్నారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.. ప్రతి ఒక్కరు క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు పీవీ సింధు. మరోవైపు మరో నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా పేద క్రీడాకారులకు సహాయార్థం విరాళం ప్రకటించారు.. ఇదివరకే రాజధాని నిర్మాణానికి మొదటి నెల జీతం అందజేసిన విషయం విదితమే..