Site icon NTV Telugu

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి

ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గ గుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. అక్రమాలు సహించేదే లేదంటూ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని… దుర్గగుడి ఉద్యోగులపై ఏసీబీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. దుర్గ గుడి ఈవో తప్పు చేశారని.. లెక్క తేలితే బొక్కలు పగులుతాయని హెచ్చరించారు. అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి మీద చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మేం.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందలేమా..? అని పేర్కొన్నారు. అవసరాల కోసం ఓటర్లకు ఎర వేసే పార్టీ తమది కాదని..అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం జగన్‌ ప్రతీ సందర్భంలో చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు. మతాలు మార్చే వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు బుర్రను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని..ఆయన మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలని ఎద్దేవా చేశారు.

Exit mobile version