NTV Telugu Site icon

Nara Lokesh: ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో మంత్రి నారా లోకేష్.. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు

Lokesh

Lokesh

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉంది. నేడు మధ్యాహ్నం 12.45కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన నివాసంలో కలవనున్నారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం, నూతన విద్యా విధానాలపై చర్చించనున్నారు.

Also Read: Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు.. ఎందుకంటే?

ఆ తర్వాత 1.30 గంటలకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని మంత్రి నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, కొత్త పరిశ్రమల స్థాపనపై మంత్రితో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ నారా లోకేష్ అన్ని శాఖల మంత్రులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. పర్యటన పూర్తయిన తర్వాత పలు ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

Also Read: SSMB 29 : రాజమౌళి – మహేశ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ బ్యూటీ.?