Site icon NTV Telugu

AP Mega DSC 2025: డీఎస్సీకి 106 అడ్డంకులు.. అధిగమించిన కూటమి ప్రభుత్వం..!

Ap Mega Dsc

Ap Mega Dsc

మెగా డీఎస్సీ విజేతల సభ ప్రారంభమైంది. డీఎస్సీలో 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెగా డీఎస్సీ విజేతల సభకు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలను నిర్వహించారు. 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనతను దక్కించుకుంది కూటమి పార్టీ. 2025 ఏడాదిలో మెగా డీఎస్సీ ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేశారు మంత్రి నారా లోకేష్.

READ MORE: Kishan Reddy: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వాఖ్యలు..

106 కేసులతో మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునే యత్నం జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి.. డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టడంపై అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అన్ని జిల్లాల నుంచి నియామక పత్రాలు అందుకునేందుకు కుటుంబ సభ్యులతో తరలి వచ్చారు. మెగా డిఎస్సీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2590 టీచర్ పోస్టుల భర్తీ జరిగింది. వాళ్లల్లో 7,955 మంది మహిళలు.. 7,986 మంది పురుషులు టీచర్లుగా నియమితులయ్యారు. పురుషులతో సమానంగా దాదాపు 50 శాతం మంది ఎంపిక కావడం మెగా డీఎస్సీ విశిష్టత.

READ MORE: AP Assembly: కామినేని vs బాలయ్య.. జగన్‌తో సినీ ప్రముఖుల మీటింగ్‌పై మాటల యుద్ధం

Exit mobile version