Site icon NTV Telugu

AP Liquor Scam: గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు!

Govindappa Balaji

Govindappa Balaji

ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీని సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో గోవిందప్ప ఏ33గా ఉన్నారు. కుంభకోణంలోని వేల కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించి అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో గోవిందప్ప కీలక పాత్ర పోషించారు. ఇక గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

‘లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడు. మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్ల నిలిపివేతలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప సన్నిహితుడు. ప్రముఖ బ్రాండ్ల మధ్యంను ఉద్దేశ్యపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు. డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసే వ్యవస్థలో కీలకంగా వ్యవరించారు. డిస్టలరీస్ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు వాళ్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను సిద్ధం చేశారు’ అని సీఐడీ పేర్కొంది.

Exit mobile version