Site icon NTV Telugu

AP Liquor Scam: సిట్ చార్జి షీట్ పై కోర్టు అభ్యంతరాలు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ!

Ap Liquor Scam

Ap Liquor Scam

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో దాఖలైన సిట్ చార్జ్‌షీట్‌పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం సుమారు 20కి పైగా అభ్యంతరాలు నమోదు చేసింది. న్యాయస్థానం స్పష్టంగా సిట్‌ను అభ్యంతరాలను మూడు రోజుల్లోగా నివృత్తి చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సిట్ ఈ కేసులో రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది.

Harsh Goenka-BCCI: టీమిండియాకు జెర్సీ స్పాన్సర్‌ చేస్తే.. కంపెనీ మూసుకోవాల్సిందే!

జూన్ 19న ప్రైమరీ చార్జ్‌షీట్, అనంతరం ఆగస్టు 11న రెండో అదనపు చార్జ్‌షీట్ ను సిట్ సమర్పించింది. ఏసీబీ కోర్టు అభ్యంతరాల విషయాలు గమనించనట్లైతే..

* నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా?

* అవినీతి నిరోధక చట్టం ఈ కేసుకు ఏ విధంగా అప్లయ్ అవుతుంది చెప్పండి.

* ఈ కేసులో సిట్ ఎంత మందిని సాక్షులుగా విచారించింది వివరాలు ఇవ్వండి.

* ఎంత మంది సాక్షుల దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డు చేశారు వివరాలు ఇవ్వండి.

* మధ్యవర్తులు రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించండి.

* లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో FIR, రిమాండ్ రిపోర్ట్, చార్జి షీట్ చూపించండి.

* సాక్షులు, డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించండి.

* చార్జి షీట్ లో చూపించిన డాక్యుమెంట్లకు CF నంబర్ లు చూపించండి.

* విచారణ అధికారి ప్రతి సాక్షి స్టేట్ మెంట్ కు చివరన సంతకాలు చేయండి.

అయితే తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై న్యాయస్థానం అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి, వాటిని సరిచేసి తిరిగి సమర్పించాలని ఆదేశించింది. చూడాలి మరి కోర్ట్ తీర్పుతో సిట్ ఎలాంటి వివరణ ఇవ్వనుందో.

coconut auction ₹5.71 lakhs: కొబ్బరికాయకు రూ.5.71లక్షలు.. ఇది మామూలు టెంకాయ కాదు

Exit mobile version