Site icon NTV Telugu

AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే!

Ap Liquor Sales

Ap Liquor Sales

డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నూతన సంవత్సర వేడుకల ప్రభావంతో డిసెంబర్ 2025లో లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్ట్రంలో మొత్తం రూ.2,767 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ 2024తో పోలిస్తే సుమారు 8 శాతం పెరిగింది. 2024 డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రూ.2,568 కోట్లు. డిసెంబర్‌లో చివరి మూడు రోజుల్లో రికార్డ్ సేల్స్ నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 మూడు రోజుల్లోనే రూ.543 కోట్లు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 2024లో ఇదే మూడు రోజుల్లో అమ్మకాలు కేవలం రూ.336 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలు, సెలవులే లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణం అని అధికారులు అంటున్నారు.

Also Read: Uttam Kumar Reddy: రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా?

జిల్లాల వారీగా మద్యం అమ్మకాలల్లో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. విశాఖలో రూ.178.6 కోట్ల లిక్కర్ అమ్మకాలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలో రూ. 169.4 కోట్లు.. ఎన్టీఆర్ జిల్లాలోరూ. 155.4 కోట్లు జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లాలో రూ.30.7 కోట్ల అమ్మకాలు జరగగా.. పార్వతీపురం మన్యంలో రూ.35.4 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 65 కోట్లు సేల్స్ జరిగాయి. రోజువారీ సేల్స్‌తో పోలిస్తే.. న్యూ ఇయర్ సమయంలో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి. డిసెంబర్ నెల మొత్తం లిక్కర్ సేల్స్ రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Exit mobile version