Site icon NTV Telugu

Ap Jobs : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాలు..

Job Vacancy

Job Vacancy

ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది సర్కార్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని నిర్ణియంచారు. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ నియామక ప్రక్రియను నిర్వహించనుంది..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.. ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు. ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇకపోతే ఈ పోస్టులకు ధరఖాస్తూ చేసుకొనేవారు ముందుగా దరఖాస్తు ఫీజు రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 గా నిర్ణయించారు..

ఇకపోతే అభ్యర్ధులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు ఆఖరి తేదీ సెప్టెంబరు 24గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్.. https://dme.ap.nic.in/ పరిశీలించగలరు.. దరఖాస్తుల ను ఈ నెల 24 సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు.. అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

Exit mobile version