Site icon NTV Telugu

AP JAC Amaravati: ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుస్తోన్న జేఏసీ నేతలు.. మా సమస్యలు పెద్దలకు తెలపండి..

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu

AP JAC Amaravati: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా నేటి నుండి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలకు ఏపీ జేఏసీ అమరావతి నేతల వినతులు సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.. మీరైనా మా సమస్యలు ప్రభుత్వ పెద్దలకు తెలపండి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు.. ఉద్యోగుల ఆవేదనని మీరైనా పట్టించుకొండి.. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమన్నారు మరి సమస్యల మాటేంటి? అని ప్రశ్నిస్తున్నారు.. చట్టసభల్లో సభ్యులైన మీరైనా మా సమస్యను వినండి అని విజ్ఞప్తి చేశారు..

ఇక, ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్‌ జిల్లాలో ఎమ్మెల్యేను కలిశారు ఏపీ జేఏసీ అమరావతి, NTR జిల్లా నేతలు.. ఏపీ జేఏసీ అమరావతి మూడవ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ” ఉద్యోగుల వేదనను చెబుదాం ” అనే నినాదంతో ఈ రోజు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కలిసి వినతిపత్రం ఇచ్చారు.. ఉద్యోగులకు చెందిన ప్రధాన డిమాండ్స్ ను తెలియ పరుస్తూ రిప్రెజెoటేషన్ ఇచ్చారు..

ఇక, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల విషయానికి వెళ్తే.. 1) ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు , పెన్షనర్ల కు పెన్షన్ ఇవ్వాలి. 2) 1.7.2018, 1.1.2019, 1.7.2019, 1.7.2021 పెండింగ్ లో ఉన్న 4 DA అరియర్స్ వెంటనే విడుదల చేయాలి. 3) 11 వ PRC కమీషన్ రికమెండ్ చేసిన పే స్కేల్స్ వెంటనే విడుదల చేయాలి. 4) PRC అరియర్స్ వెంటనే విడుదల చేయాలి.. 5) పెండింగ్ లో ఉన్న 2 DA లు వెంటనే విడుదల చేయాలి. 6). గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర లో ప్రకటించినట్లుగా CPS ను వెంటనే రద్దు చేసి OPS లోకి మార్చాలి.. 6) కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి లాంటి అనేక ఆర్ధిక అర్ధికేతర డిమాండ్ల పరిష్కారం చేయమని 50 పేజీల మెమొరాండం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇప్పటికే సమర్పించి ఉన్నామని గుర్తుచేశారు. దీనిపై ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు స్పందిస్తూ ఉద్యోగుల ప్రధాన సమస్యలు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు చెబుతున్నారు.

Exit mobile version