AP Inter Results 2023: ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులకు అలర్ట్.. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.. రేపు అనగా.. ఈ నెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ ఫలితాలను విడుదల చేయబోతున్నారు.. విజయవాడలోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లెమన్ ట్రీ ప్రీమియర్ వద్ద ఈ ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు..
Read Also: Simhadri Appanna Temple Incident: సింహాచలంలో అపచారం.. సర్కార్ సీరియస్..
కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,03,990 మంది విద్యార్థులు ఇంటర్‌మీడియట్ పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.. వారిలో 4,84,197 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా.. 5,19,793 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు.. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు.. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు.. అందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన విషయం విదితమే..