NTV Telugu Site icon

AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలలో ఆలస్యం.. కారణమేంటంటే?

Ap Inter Result

Ap Inter Result

AP Inter Results: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కాస్త ఆలస్యం కానుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే అనంతపురం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంత్రి విజయవాడ చేరుకోవడంలో ఆలస్యమైంది.

Read Also: AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. వృత్తి విద్య కోర్సుల ఫలితాలను కూడా ఈ రోజే విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు.