Site icon NTV Telugu

AP ICET 2025: ఐసెట్‌ ఫలితాలు విడుదల.. విశాఖ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్!

Ap Icet 2025 Results

Ap Icet 2025 Results

ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఐసెట్ ఫలితాలు ఏయూ వీసీ ప్రొ.రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్‌లో 95.86 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విశాఖకు చెందిన మనోజ్ మేకా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. సందీప్ రెడ్డి, కృష్ణ సాయిలకు వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకులు దక్కాయి. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అలానే వాట్సాప్‌ గవర్నెన్స్‌ నంబర్ 9552300009లో ఫలితాలు పొందవచ్చు.

Also Read: Yanamala Rama Krishnudu: కేసులన్నీ తేలితే వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం!

ఐసెట్‌ 2025లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ‘ఏపీ ఐసెట్ 2025లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు. ఫలితాలు https://cets.apsche.ap.gov.in/ICET, వాట్సాప్‌ గవర్నెన్స్‌ నంబర్ 9552300009లో అందుబాటులో ఉన్నాయి. 34,131 మంది విద్యార్థులలో 32,719 మంది విద్యార్థులు అర్హత సాధించారు (95.86%). మీ ఉజ్వల విద్యా భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు’ అని నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు.

Exit mobile version