Vangalapudi Anitha: హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు..

  • ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు..
  • రెడ్ బుక్ నాకన్నా.. అయ్యన్న వద్ద ఉంటేనే బావుండేది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు..
Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేవారు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సన్మాన సభ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. రెడ్ బుక్ నాకన్నా, అయ్యన్న వద్ద ఉంటేనే బావుండేది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అయితే, అయ్యన్నపాత్రుడు స్పీకర్ అనేసరికి నాకు మొదట గుర్తించింది జగనే అని వ్యాఖ్యానించారు.. అయ్యన్న అంటే భయమో..? ఏమో..? తెలియదు.. కానీ స్పీకర్ గా ప్రకటించినప్పటినుంచి జగన్‌ శాసనసభకు రాలేదు అని ఎద్దేవా చేశారు.. ఇక, స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడును భిక్ష అడిగితే గాని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది.. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టుగా అభివర్ణించారు.. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు అయ్యన్నకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూశారు… ఆరడుగుల స్థలం కోసం వందల మంది పోలీసుల్ని గోడలు దూకించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.

Read Also: Stress Effects: ఒత్తిడికి గురవ్వడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో తెలుసా..?