Site icon NTV Telugu

Bigg Boss: బిగ్‌బాస్‌ షో నిలిపివేయాలన్న పిటిషనర్‌కు ఏపీ హైకోర్టు షాక్..

Ap High Court

Ap High Court

బిగ్ బాస్ షో నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నేడు (బుధవారం ) డిస్పోజ్ చేసింది. ఇదే విషయమై ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలైన విషయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. బిగ్ బాస్-7 షోను నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో ఈ సంవత్సరం జూలై నెలలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై బిగ్ బాస్ నిర్వాహకులకు, ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఇదే విషయంపై మరోసారి పిల్ దాఖలైంది. తాజాగా దాఖలైన పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పాత పిటిషన్లలోనే అనుబంధ పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం వెల్లడించింది.

Exit mobile version