Site icon NTV Telugu

AP High Court: సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

Ap High Court

Ap High Court

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణ చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐని సుమోటోగా ఇంప్లేడ్ చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసింది. తాడేపల్లిలో ఉన్న సవీంద్ర రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన లాలాపేట పోలీసులు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఒక కేసులో అరెస్ట్ చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారని హైకోర్టులో పిటిషన్ దాఖలవగా విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

Also Read: IND vs PAK: అభిషేక్ బచ్చన్‌ను త్వరగా అవుట్ చేస్తే.. పాకిస్థాన్‌ ఈజీగా గెలుస్తుంది: అక్తర్

జియో నెట్ వర్క్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో సవీంద్ర రెడ్డి ఫోన్ సెల్ టవర్, కాల్ డేటా నివేదికను హైకోర్టు పరిశీలించింది. యూనిఫాం లేకుండా పోలీసులు అక్రమంగా తీసుకు వెళ్లడంపై హైకోర్టు సీరియస్ అయింది. సవీంద్ర రెడ్డి అరెస్ట్ సమయంలో కన్ఫిషన్ స్టేట్ మెంట్, రిమాండ్ రిపోర్ట్ లో సమయాలు కూడా తప్పుగా నమోదు చేసినట్టు కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. సవీంద్ర రెడ్డి భార్య ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు పక్కన పెట్టారని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. దాంతో హైకోర్టు పోలీసులపై మండిపడింది.

Exit mobile version