Site icon NTV Telugu

AP High Court: ఆ టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు.. ప్రభుత్వానికి ఆదేశాలు

Ap High Court

Ap High Court

AP High Court: టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డికి పర్సనల్ నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు విజయవాడకి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు.. మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని ధర్మాసనానికి విన్నవించారు.. ఇక ఆ పిటిషన్ విచారించిన చీఫ్ జస్టిస్ మరియు జస్టిస్ రఘునందన రావు ధర్మాసనం.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది.. అయితే, శిక్ష ఇంకా విధించని కారణంగా వారు నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు..

Read Also: Urvashi Rautela: బ్లాక్ డ్రెస్ లో కళ్ళు చెదరకొడుతున్న ఊర్వశి రౌటేలా

మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుండి తొలగింప బడిన కేథన్ దేశాయ్‌ను టీటీడీ సభ్యుడిగా నియమించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు చింతా వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది శ్రావణ్.. లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, ఎమ్మెల్యే ఉదయ భానుపై క్రిమినల్ కేసులు నమోదు కాబడ్డాయన్నారు.. అయితే, కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Exit mobile version