Site icon NTV Telugu

YS Jagan: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట!

Ap High Court Ys Jagan

Ap High Court Ys Jagan

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్‌ను పోలీసులు విచారించకుండా.. న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలుకు ఏజీ 2 వారాల గడువు కోరగా.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

Also Read: PVN Madhav: బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారుస్తా: పీవీఎన్ మాధవ్

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు వైఎస్ జగన్‌ వెళ్తుండగా.. వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. జగన్‌ కాన్వాయ్‌ కారణంగానే సింగయ్య మృతి చెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ జగన్‌తో పాటు పలువురు నేతలు క్వాష్‌ పిటిషన్లు వేశారు. వాటంన్నింటిని హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈరోజు కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపి వేస్తూ ఏపీ హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణలో పురోగతి ఏం ఉందని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించింది.

Exit mobile version