NTV Telugu Site icon

Chandrababu Gets Bail: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్‌ మంజూరు

Babu

Babu

Chandrababu Gets Bail: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభిచింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది న్యాయస్థానం.. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. ఈ రోజు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. మొత్తంగా అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు నవంబర్‌ 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.. ఇప్పుడు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినా.. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై వచ్చే నెల 10వ తేదీన విచారణ జరపనుంది హైకోర్టు.. కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. పలు మార్పు చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ వచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. గత 53 రోజులగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో వున్నారు చంద్రబాబు నాయుడు.. హైకోర్టు తీర్పుతో ఆయనకు భారీ ఊరట లభిచింది. దీంతో.. సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉంది.