NTV Telugu Site icon

AP High Court: మాజీ మంత్రి బాలినేని పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..

Balineni

Balineni

మాజీ మంత్రి బాలినినేని శ్రీనివాస్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలులో ఎన్నికల అక్రమాల విషయంలో ఈసీ నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బాలినేనికి చుక్కెదురైంది. బాలినేని దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గత ఎన్నికల సమయంలో ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అవకతవక జరిగాయంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో పిల్‌ వేశారు. ఈ క్రమంలో.. హైకోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. ఈవీఎంల వ్యవహారంపై ఆగస్టు 13వ తేదీన హైకోర్టులో పిల్ వేశారు బాలినేని. అంతేకాకుండా.. ఆ పిల్‌పై ఆగస్టు 15వ తేదీన బాలినేని తరుపున న్యాయవాది ఆలపాటి వివేకానంద వాదనలు వినిపించారు. ఆ తర్వాత.. ఆగస్టు 17వ తేదీన తీర్పును రిజర్వు చేసింది ఏపీ హైకోర్టు. తాజాగా.. తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది. కాగా.. గతంలో వైసీపీలో ఉన్న మాజీమంత్రి బాలినేని.. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

Show comments