NTV Telugu Site icon

ఐఏఎస్ అధికారులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో పీఆర్సీ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలిచింది. అయితే అక్కడి పరిణామాలపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఐఏఎస్ అధికారులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.

సీఎస్ సమీర్ శర్మ మమ్మల్ని అవమానించారు. నలుగురం జేఏసీల నేతలు రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళితే ఒక నిమిషం సమయం కూడా కేటాయించ లేదు. మర్యాద కోసం అయినా కూర్చోమని చెప్పలేదు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ కలెక్టర్లకు చెప్పారు.

మమ్మల్ని అవమానించిన రోజు ఈ విషయం గుర్తు లేదా?ఆర్ధిక శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తున్నారు. ఈ దేశ పౌరుడిగా అధికారుల పై ఫిర్యాదు చేసే హక్కు నాకు ఉంది. అధికారుల వ్యవహార శైలి ఇలానే ఉంటే కేంద్ర డీఓపీటీకు కచ్చితంగా ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇదిలా వుంటే.. పీఆర్సీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐఆర్, హెచ్చార్ఏ అడ్జస్ట్మెంటుని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. మూడు వారాల తర్వాత విచారణ జరపనుంది. పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జీతాల్లో రికవరీ అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమంది హైకోర్టు. సమ్మె ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు అని పేర్కొంది హైకోర్టు.