ఏపీలో కీలకంగా మారిన జీవో నెంబర్ 1పై వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై పొలిటికల్, నాన్ పొలిటికల్ పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించాం అన్నారు. 2008లో ప్రజారాజ్యం సభలో జరిగిన తొక్కిసలాట అనంతరం సర్క్యులర్ ఇచ్చారు.ఆ సర్క్యులర్ ను అమలు చేయాలని కోరాం. 15 ఏళ్లు దాటినా ఇప్పటిదాకా ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు.
Read Also: AP BJP Chief Somu Veerraju & GVL Press Meet Live: ఎన్నికల పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
2008లో సర్క్యులర్ కు ప్రస్తుత జీవో 1 మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం లేదని వాదించాం అన్నారు జంధ్యాల రవిశంకర్. సిఎం కు బ్యానర్లు కడుతున్నారు… ప్రతిపక్షాలు కడుతుంటే తొలగిస్తున్నారు. అందరూ వాదనలు వినిపించారు, ఎజి ప్రభుత్వ విధానాలను వివరించారు. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. అన్ని కోణాల్లో వాదనలను ధర్మాసనం విన్నారు కాబట్టి మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.
Read Also: Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా