Site icon NTV Telugu

AP School Kits: విద్యార్థులకు స్కూల్ కిట్లు.. రూ.830.04 కోట్ల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్.. కిట్‌లో ఉండేవి ఇవే..

Ap Govt

Ap Govt

AP School Kits: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.830.04 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా పరమైన అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యాసంవత్సరంలో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లను “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” పేరిట పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 తేదీలు ఖరారు

విద్యార్థులకు అందించనున్న స్కూల్ కిట్లలో.. నోట్‌బుక్స్, బెల్ట్, షూలు, స్కూల్ బ్యాగ్, పిక్టోరియల్ డిక్షనరీ, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్, మూడు జతల యూనిఫాం క్లాత్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కల్పిస్తూ రూ.157.20 కోట్ల నిధులు అందించనున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ కిట్ల సరఫరా, పంపిణీ బాధ్యతలను టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్ణయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సామగ్రి అందుబాటులోకి రానుండగా, విద్యాభ్యాసానికి మరింత తోడ్పాటు లభించనుందని అధికారులు భావిస్తున్నారు.

Exit mobile version